
ఎ9 న్యూస్ వెల్దుర్తి మెదక్ ఆగస్టు 10
మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మానేపల్లి గ్రామంలో బూత్ అధ్యక్షులు వెంకట్ ఆధ్వర్యంలో మహా సంపర్క అభియాన్ లో భాగంగా ఇంటింటికి బిజెపి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బిజెపి మెదక్ జిల్లా అధ్యక్షులు వాళ్దాస్ రాధ మల్లేష్ గౌడ్ రావడం జరిగింది. ప్రతి ఇంటికి తిరిగి డోర్ స్టిక్కర్లు వేసి కరపత్రాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా భారత జవాన్ ఆపరేషన్ సింధూర్ లో పాల్గొన్న జవాన్ కు గ్రామం నడి ఒడ్డున సన్మానించి బిజెపి మహిళా మోర్చా నాయకులు రక్షాబంధన్ సందర్భంగా రాఖీ కట్టడం జరిగింది. జిల్లా అధ్యక్షులు వాళ్దాస్ రాధ మల్లేష్ గౌడ్ మాట్లాడుతూ మానేపల్లి గ్రామం అభివృద్ధికి నోచుకోలేదు ఇప్పటికైనా ప్రజలు ఆలోచించి అభివృద్ధి బిజెపి తోనే సాధ్యమవుతుందని నమ్మి బీజేపీకి ఓటు వేయాలని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు దాసు మండల సీనియర్ నాయకులు శ్రీనివాస్ గౌడ్ శేఖర్ గౌడ్ నర్సింలు కర్రె వెంకట్ మహిళా మోర్చా నాయకులు కవిత, మల్లిక, మౌనిక గార్లు గ్రామ నాయకులు భాస్కర్ ఎల్లం లడ్డు తదితరులు పాల్గొన్నారు.








