అయ్యప్ప ఆలయంలో పూజలు – అన్నదాన కార్యక్రమానికి శ్రీకారం….

On: Wednesday, July 8, 2026 6:32 PM

A9 న్యూస్:

ఆర్మూర్ పట్టణంలోని జంబిహాన్ ఆలయ ప్రాంగణంలో ఉన్న అయ్యప్ప ఆలయంలో బుధవారం ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. అనంతరం ఆర్మూర్ అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన అన్నదాన కార్యక్రమాన్ని ఆర్మూర్ మున్సిపల్ ఛైర్‌పర్సన్ గోనే లహరి రఘు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె ప్రత్యేక పూజల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా గోనే లహరి రఘు మాట్లాడుతూ ఆధ్యాత్మిక కార్యక్రమాలు సమాజంలో ఐక్యత, పరస్పర సహకారం, మానవత్వాన్ని పెంపొందిస్తాయని అన్నారు. భారతీయ సంస్కృతిలో అన్నదానాన్ని మహాదానంగా భావిస్తారని, ఆకలితో ఉన్న వారికి అన్నం పెట్టడం ద్వారా దైవానుగ్రహం లభిస్తుందని పేర్కొన్నారు. అయ్యప్ప స్వామి భక్తులు భక్తిశ్రద్ధలతో, సేవాభావంతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం అభినందనీయమని కొనియాడారు. ప్రతి భక్తుడు అయ్యప్ప స్వామి బోధించిన క్రమశిక్షణ, సేవా తత్వం, సమానత్వ భావనను జీవితంలో ఆచరించాలని పిలుపునిచ్చారు. అనంతరం నగేష్ శర్మ గురుస్వామి ఆధ్వర్యంలో ముఖ్య అతిథిగా హాజరైన మున్సిపల్ ఛైర్‌పర్సన్ గోనే లహరి రఘు దంపతులను శాలువాతో ఘనంగా సన్మానించి తీర్థప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో ఆర్మూర్ అయ్యప్ప సేవా సమితి అధ్యక్షుడు పుట్టి మురళి, కార్యదర్శి మీసాల రవి, ముఖ్య సలహాదారులు జనార్దన్ గౌడ్, దత్తు, పోల సుధాకర్, సీహెచ్ అశోక్, స్వామి, శ్రీహరి, కౌటిక విజయ్, మీసాల రాజేశ్వర్, వంట నరేష్, మున్సిపల్ కౌన్సిలర్లు బొగడ మీది సుమన్, బొప్పెన ప్రసాద్, బీజేపీ నాయకులు నూతుల శ్రీనివాస్, కంచెట్టి గంగాధర్, ద్యాగ ఉదయ్, బాల్కొండ రాజు, పూల ప్రసాద్, నందు, గంగాధర్ గౌడ్, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.

09 Jul 2026

Leave a Comment