మాసాయిపేట, జూలై 7 (ఎ9 న్యూస్): మెదక్ జిల్లా మాసాయిపేట మండల కేంద్రంలోని జాతీయ రహదారి పక్కన ఉన్న డా. బి.ఆర్. అంబేద్కర్ విగ్రహం వద్ద దండోరా వ్యవస్థాపకుడు, పద్మశ్రీ మందకృష్ణ మాదిగ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా నాయకులు మందకృష్ణ మాదిగ సామాజిక న్యాయం కోసం చేసిన ఉద్యమాలు, ఆరోగ్యశ్రీ కార్డు, వితంతు పింఛన్, వికలాంగుల సంక్షేమం, అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు మరియు ఇతర వర్గాల హక్కుల కోసం చేసిన కృషిని కొనియాడారు.
ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్‌చార్జి ఎర్పుల యాదగిరి మాదిగ, గుడ్డి కృష్ణ మాదిగ మాట్లాడుతూ ఆయన సేవలను ప్రశంసించారు. కార్యక్రమంలో దాసు మాదిగ, ఎర్రస్వామి మాదిగ, దశరథ మాదిగ తదితరులు పాల్గొన్నారు.








