చట్టం ఆర్మూర్:
ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలోని పోచమ్మ గల్లి 13వ వార్డు లో గల అంబేద్కర్ మాల సంఘం శిథిల అవస్థలో ఉన్నది కావున మాల సంఘం భవనం పునః నిర్మాణం కొరకు నిధులు 15లక్షలు మంజూరు చేయాలని మున్సిపల్ చైర్ పర్సన్ గోనె లహరి, వైస్ చైర్మన్ కాటిపల్లి వెంకటరెడ్డి, 13వ వార్డు కౌన్సిలర్ కోడిగేల మల్లయ్య లకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ మాల సంఘం అధ్యక్షుడు పులి యుగేందర్, ఉపాధ్యక్షుడు వెన్న రమేష్, ప్రధాన కార్యదర్శి కొంతం మురళిధర్, కార్య నిర్వహణ కార్యదర్శి పింజ సుదర్శన్, కార్యవర్గ సభ్యులు వెన్న మోహన్, కొంతం పూర్ణ చందర్, మాజీ కౌన్సిలర్ ఆకుల రాము తదితరులు పాల్గొన్నారు.








