చదువుల తల్లి సావిత్రిబాయి పూలే జయంతి శుభాకాంక్షలు….

On: Saturday, January 3, 2026 1:20 PM

 

హైదరాబాద్:జనవరి 03

మనకున్నది ఒకే ఒక శత్రువు ఆ శత్రువే అజ్ఞానం విద్యావంతులై ఆ శత్రువుని తుది ముట్టించడమే మన లక్ష్యం అని సావిత్రిబాయి పూలే,చేసిన వ్యాఖ్యలు విద్యకు ఆమె ఇచ్చిన ప్రాముఖ్యతను తెలుపు తున్నయి, సావిత్రిబాయి పూలే 1831 వ సంవత్సరం జనవరి 3న మహారాష్ట్ర లోని సాతార జిల్లా నయగావ్ గ్రామంలో జన్మించారు.

ఆమెకు తొమ్మిదవ ఏటనే 14 సంవత్సరాలు ఉన్న జ్యోతిరావు పూలే, తో వివాహమైంది జ్యోతిరావు పూలే,అడుగుజాడల్లో నడిచి, సమసమాజ స్థాపన కోసం అనునిత్యం ప్రజలను చైతన్యం చేసిన వ్యక్తి సావిత్రిబాయి పూలే, ఒక్క మాటలో చెప్పాలంటే భర్త జ్యోతిరావు పూలే, వెలిగించిన జ్ఞాన జ్యోతి సావిత్రిబాయి పూలే..

సమాజంలోని శూద్రులకు అంటరాని వాళ్లకు స్త్రీలకు విద్యను అందించాలని ఏకై క లక్ష్యంతో విద్యాసంస్థలు స్థాపించారు.ఇదే లక్ష్యంతో 1848లో జనవరి 14న పూణేలోని బుధవార్ పేటలో తాత్యా సాహెబ్ భీడే, అనే బ్రాహ్మణుడి ఇంట్లో బాలికల పాఠశాల స్థాపించారు.

పాఠశాల ప్రారంభించిన మొదట్లోనే అన్నపూర్ణ జోషి, సుమతిమోకాశి, దుర్గ,మాధవి, దత్తె, సోను పవర్, అనే 6 మంది బాలి కలు పాఠశాలలో చేరారు. సావిత్రిబాయి పాఠశాలలకి వచ్చిన వారికి చదువు విలువ చెప్పి వారిని చైతన్యవంతులు చేసింది స్త్రీల జీవితాలలో విప్లవాత్మకమైన చైతన్యం తీసుకువచ్చిన ధీరశాలి సావిత్రిబాయి పూలే.

05 Feb 2026

Leave a Comment