పిచ్చికుక్కల దాడిలో గాయపడిన వారిని పరామర్శించిన ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి….

On: Thursday, August 28, 2025 2:53 PM

 

మాసాయిపేట, ఆగస్టు 28 (ఎ9 న్యూస్):

మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గానికి చెందిన శాసనసభ్యురాలు సునీత లక్ష్మారెడ్డి మంగళవారం నాడు మాసాయిపేట గ్రామంలో పిచ్చికుక్కల దాడిలో గాయపడిన బాధితులను మెదక్ ప్రభుత్వ ఆసుపత్రిలో పరామర్శించారు.

ఈ సందర్భంగా ఆమె బాధితులతో మాట్లాడి, వారికి తగిన వైద్యం అందించేలా వైద్యులను ఆదేశించారు. గాయపడిన వ్యక్తులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన ఆమె, ప్రభుత్వ ఆసుపత్రిలో అన్ని వైద్య సదుపాయాలు అందుబాటులో ఉండేలా చూడాలని అధికారులను కోరారు.

మాసాయిపేట మాజీ సర్పంచ్ చిటిమిల నాగరాజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గాయపడిన వారికి ధైర్యం చెబుతూ, ప్రభుత్వ సహాయం అందించేందుకు తాను పూర్తిగా సహకరించనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.

21 Jan 2026

Leave a Comment