10వ తెలంగాణ సబ్‌జూనియర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ చాంపియన్‌షిప్‌కు మాదరి ప్రణయ ఎంపిక…

On: Wednesday, December 24, 2025 9:56 AM

ఈ నెల 24 నుంచి 25వ తేదీ వరకు తెలంగాణ క్రీడా ప్రాంగణం, మనోహరాబాద్‌లో నిర్వహించనున్న 10వ తెలంగాణ సబ్‌జూనియర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ చాంపియన్‌షిప్ 2025–26 కుTGSWRS (గర్ల్స్), ధర్మారం కు చెందిన 9వ తరగతి విద్యార్థిని మాదరి ప్రణయ (తండ్రి: మాదరి స్వామి) ఎంపిక కావడం పట్ల పాఠశాల యాజమాన్యం హర్షం వ్యక్తం చేసింది.

ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ మాధవి లత, వైస్ ప్రిన్సిపల్ ప్రేమలత, పీడీ నీరజ, పీఈటీ స్వప్న, క్లాస్ టీచర్ సుమలత విద్యార్థినిని అభినందించారు. అలాగే సాఫ్ట్‌బాల్ జిల్లా అసోసియేషన్ అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి, జనరల్ సెక్రటరీ గంగ మోహన్ కూడా ప్రణయను ప్రత్యేకంగా అభినందించారు.

17 Mar 2026

Leave a Comment