హైదరాబాద్:డిసెంబర్ 20
సెలవులు ప్రతి విద్యార్థికి ఇష్టమైన విషయమే అయితే కొంతకాలం క్రితం పాఠశాలలకు వారం రోజుల నుంచి పది రోజుల వరకు క్రిస్మస్ సెలవులు ఉండేవి, కాని గత కొన్నాళ్లుగా ఆ సెలవులను తగ్గిస్తూ… వచ్చారు. ఇదిలా ఉంటే, ఈ సంవత్సరం క్రిస్మస్ సెలవులు ప్రకటించారు.
చాలా వరకు స్కూళ్లకు రెండు రోజులు మాత్రమే సెలవు ఉంటుండగా… కొన్ని పాఠశాలలకు మాత్రం 5 రోజులు సెలవులు ఇచ్చారు.ప్రతి సంవత్సరం డిసెంబర్ 25న క్రిస్మస్ పండుగ జరుపుకుంటారు. ఆ రోజు ప్రభుత్వ కార్యాల యాలు, విద్యాసంస్థలకు అన్నిటికీ సెలవు ఉంటుంది. అయితే, క్రిస్మస్ మరుసటి రోజు కూడా స్కూళ్లకు సెలవు ప్రకటించారు. డిసెంబర్ 26వ తేదీన బాక్సింగ్ డే సందర్భంగా స్కూళ్లకు సెలవులు ప్రకటిస్తున్నారు.
*అధికారిక సెలవులు:*
డిసెంబర్ 25 (క్రిస్మస్),
డిసెంబర్ 26 బాక్సింగ్ డే,
మధ్యలో డిసెంబర్ 27, శనివారం కొందరికి పాఠశాల ఉంటుంది, కొందరికి ఉండదు, కొందరికి హాఫ్ డే ఉంటుంది. ఈ క్రమంలో శనివారం మినహాయిస్తే, డిసెంబర్ 28వ తేదీ ఆదివారం కూడా స్కూళ్లకు సెలవులు ఉన్నాయి. అయితే క్రిస్టియన్ మిషనరీ స్కూళ్లకు ఈ సెలవుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ఆ స్కూళ్లకు ఏకంగా 5 రోజులు సెలవులు వచ్చేందుకు అవకాశం ఉంది.
క్రిస్టియన్ మిషనరీ స్కూళ్ల కు డిసెంబర్ 24 నుంచి డిసెంబర్ 28 వరకు సెలవులు ఇచ్చేందుకు అవకాశం ఉంది. హైదరాబాద్ వ్యాప్తంగా స్కూళ్లకు డిసెంబర్ 24వ తేదీ నుంచే క్రిస్మస్ సెలవు లు రానున్నాయి. దీనికి ముందుగానే పాఠశాలలో FA III ఫార్మేటివ్ అసెస్ మెంట్ III పరీక్షలు కూడా నిర్వహిస్తున్నారు.
ఈ పరీక్షలు డిసెంబర్ 23వ తేదీకి ముగియనున్నాయి. ఈ నేపథ్యంలో ఆ మరుసటి రోజు నుంచే స్కూళ్లకు సెలవులు ప్రకటించనున్నారు. ఇక 2026 ఫిబ్రవరి నెలలో FA IV (ఫైనల్ ఎగ్జామ్స్) కూడా నిర్వహిస్తారు.
తెలంగాణ ప్రభుత్వ క్యాలెండర్ ప్రకారం డిసెంబర్ 24వ తేదీన నుంచి క్రిస్మస్ పండుగ వేడుకలు జరుపుకుంటారు. ఈ నేపథ్యంలో ఆ రోజు నుంచే స్కూళ్లకు సెలవు ప్రకటిస్తారు. ఈ రెండు రోజుల కాకుండా.. అదనంగా వచ్చే సెలవుల గురించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.






