ఆర్మూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఏకగ్రీవ సర్పంచ్ ఎన్నికలు…
A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్:
ఆర్మూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు పెద్ద ఎత్తున ఏకగ్రీవంగా సర్పంచ్‌లుగా ఎన్నికై పార్టీ శక్తిని మరోసారి చాటుకున్నారు. మాక్లూర్, ఆర్మూర్, ఆలూర్ మండలాల్లో జరిగిన ఈ విజయోత్సవాల్లో గ్రామాల్లో అభివృద్ధికి అవకాశం లభించినందుకు స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.
*మాక్లూర్ మండలం – ఏకగ్రీవంగా ఎన్నికైన సర్పంచ్‌లు:
ఆమ్రద్ తండా – సర్పంచ్ నందిని, ఉప సర్పంచ్ సంతోష్ నాయక్.
*వార్డు సభ్యులు:
సుజాత, మంజుల, కమల, గంగు, గణేష్, మహేందర్, సంతోష్.
గంగారమంద – సర్పంచ్ శోభ రాణి రవీందర్, సింగం పల్లి తండా – సర్పంచ్ ఓమాజి సోయరం, మాదాపూర్ – సర్పంచ్ బ్యాగారి రవి, కొత్తపల్లి – సర్పంచ్ వేములపల్లి రత్న కుమారి (భరత్), మెట్టు – సర్పంచ్ పద్మ విజయ్ రావ్, దేగం – సర్పంచ్ ఈట్టేది లింగ రెడ్డి.
*ఆర్మూర్ – ఆలూర్ మండలాల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు:
మిర్ధపల్లి – సర్పంచ్ యల్లా సాయి రెడ్డి,
సుర్బిరియల్ – సర్పంచ్ ఎర్రం శ్రీనివాస్.
*నాయకుల సత్కారంకి:
ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఆర్మూర్ నియోజకవర్గ ఇంచార్జ్ ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి సర్పంచ్‌లను పార్టీ కండువా, శాలువలు, పూలమాలతో ఘనంగా సత్కరించారు.
ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు యల్లా సాయి రెడ్డి, ఆర్మూర్ మార్కెట్ యార్డ్ చైర్మన్ సాయిబాబా గౌడ్, మాజీ జడ్పిటిసి నగేష్, ఎంపిటిసి శ్రీనివాస్, ముత్యం రెడ్డి, దుండి రమణ, తదితరులు పాల్గొన్నారు.







