A9 న్యూస్ ప్రతినిధి – ఇందలవాయి:
ఇందలవాయి మండలం గన్నారం గ్రామానికి చెందిన రైతు బద్దం రవీందర్ రెడ్డి (46) ఆదివారం ఉదయం రైలు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యాడు.
వివరాల్లోకి వెళితే… రవీందర్ రెడ్డి వ్యవసాయం కోసం గ్రామ శివారులోని తన పొలం వద్దకు వెళ్తుండగా, ఇందలవాయి – సిర్నాపల్లి రైల్వే స్టేషన్ల మధ్య పట్టాలు దాటే క్రమంలో గుర్తుతెలియని రైలు ఢీకొట్టింది. బలమైన ఢీకొట్టడంతో ఆయన అక్కడికక్కడే మృతిచెందగా, శరీరం రెండు ముక్కలైంది.
ఈ ఘటనపై సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పంచనామా నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. నిజామాబాద్ ఆర్‌పిఎస్‌లో కేసు నమోదు కాగా, హెడ్ కానిస్టేబుల్ హనుమాన్లు దర్యాప్తు చేపట్టారు. రైల్వే ఎస్సై సాయి రెడ్డి ఈ విషయాన్ని ధృవీకరించారు.
గ్రామంలో రైతు మృతి విషాదాన్ని మిగిల్చింది.







