శివాజీ సర్కిల్ నుంచి ప్రారంభం | ముఖ్య అతిధిగా వెళ్దాస్ రాధా మల్లేష్ గౌడ్.
A9 న్యూస్, రామాయంపేట, మెదక్ | ఆగస్టు 11:
భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పిలుపు మేరకు, రేపు (ఆగస్టు 11, 2025 సోమవారం) ఉదయం 9:30 గంటలకు రామాయంపేటలో బీజేపీ ఆధ్వర్యంలో భవ్యంగా తిరంగా యాత్ర నిర్వహించనున్నారు. రామాయంపేట పట్టణంలోని చత్రపతి శివాజీ విగ్రహం దగ్గర నుంచి యాత్ర ప్రారంభమవుతుంది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా బీజేపీ మెదక్ జిల్లా అధ్యక్షులు శ్రీ వెళ్దాస్ రాధా మల్లేష్ గౌడ్ హాజరుకానున్నారు. అనంతరం మండలంలోని వివిధ గ్రామాల నుంచి బీజేపీ కార్యకర్తలు, రాష్ట్ర-జిల్లా నేతలు, శక్తి కేంద్ర ఇన్‌చార్జులు, మోర్చా నాయకులు, భూత్ అధ్యక్షులు పాల్గొననున్నారు.
రామాయంపేట పట్టణంలోని ప్రజలు పెద్ద ఎత్తున హాజరై, ఈ దేశభక్తి యాత్రను విజయవంతం చేయాలని బీజేపీ మండల అధ్యక్షుడు శ్రీ గొల్లపల్లి నవీన్ గౌడ్ పిలుపునిచ్చారు.








