శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో విషాదం.. ముప్కాల్ లక్ష్మీ కాలువలో నలుగురు గల్లంతు

On: Sunday, July 26, 2026 6:51 PM

*ఇద్దరి మృతదేహాలు వెలికితీత.. మరో ఇద్దరి కోసం గాలింపు కొనసాగింపు…

* నిజామాబాద్ ఆటోనగర్‌కు చెందిన యువకులుగా గుర్తింపు…

* ఘటన స్థలానికి పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య చేరుకోనున్నారు…

A9 న్యూస్ నిజామాబాద్:

నిజామాబాద్ జిల్లా శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పరిధిలోని ముప్కాల్ లక్ష్మీ కాలువ హెడ్ రెగ్యులేటర్ వద్ద ఆదివారం విషాదకర ఘటన చోటుచేసుకుంది. నిజామాబాద్ నగరంలోని ఆటోనగర్‌కు చెందిన నలుగురు యువకులు కాలువలో గల్లంతయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే, రెస్క్యూ సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాలింపు చర్యల్లో భాగంగా తొలుత ఒకరి మృతదేహాన్ని వెలికితీయగా, అనంతరం మరో మృతదేహాన్ని కూడా గుర్తించి బయటకు తీశారు. మిగిలిన ఇద్దరి కోసం రెస్క్యూ బృందాలు గాలింపు చర్యలను కొనసాగిస్తున్నాయి. ఘటనపై సమాచారం అందుకున్న నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, ఐపీఎస్ ఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించనున్నారు. ఈ విషాద ఘటనతో బాధిత కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

26 Jul 2026

Leave a Comment