హైదరాబాద్, జూలై 17: హైదరాబాద్‌లోని మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ (MANUU) 2026–27 విద్యా సంవత్సరానికి సివిల్ సర్వీసెస్ (ప్రిలిమ్స్-కమ్-మెయిన్స్) ఉచిత కోచింగ్ కోసం దరఖాస్తులను ఆహ్వానించింది.
ఈ కోచింగ్ మైనార్టీలు, ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఎంపికైన వారికి ఉచిత కోచింగ్‌తో పాటు హాస్టల్ వసతి కూడా కల్పించనున్నారు.
ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు జూలై 28, 2026లోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ఎస్సే రైటింగ్ పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
మరిన్ని వివరాలకు www.manuu.edu.in వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.








