హైదరాబాద్, జూలై 17: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల కోసం రూపొందించిన ఎంప్లాయిస్ హెల్త్ స్కీం (EHS)ను శుక్రవారం డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ప్రారంభించనున్నారు.
సచివాలయంలో మధ్యాహ్నం 1 గంటకు నూతన ఈహెచ్ఎస్ పోర్టల్‌ను ప్రారంభించడంతో పాటు ఆరోగ్య కార్డులను పంపిణీ చేయనున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఇప్పటికే ఈహెచ్ఎస్ అమలుకు సంబంధించిన జీవోను జారీ చేసింది.
ఉద్యోగుల ఆరోగ్య పథకం అమలు బాధ్యతలను ఎంప్లాయిస్ హెల్త్ కేర్ ట్రస్టుకు అప్పగించిన ప్రభుత్వం, ఈహెచ్ఎస్ నిధులను ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల వైద్య సేవల కోసం మాత్రమే వినియోగించాలని నిర్ణయించింది. ఈ కొత్త వ్యవస్థతో ఆరోగ్య సేవలు మరింత పారదర్శకంగా, సులభంగా అందుబాటులోకి వస్తాయని అధికారులు తెలిపారు.








