పెర్కిట్ జెడ్పీహెచ్‌ఎస్ పాఠశాలలో సబ్ కలెక్టర్‌కు ఘన సన్మానం…

On: Friday, July 3, 2026 8:05 PM

 

ఆర్మూర్:

ఆర్మూర్ పట్టణంలోని పెర్కిట్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను శుక్రవారం ఆర్మూర్ సబ్ కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించారు.

ఈ సందర్భంగా పదో తరగతి విద్యార్థులతో ప్రత్యక్షంగా మాట్లాడి, వారి పాఠ్యాభ్యాసం, పరీక్షల సన్నద్ధత, పాఠశాలలో కల్పిస్తున్న విద్యా సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదువుతూ ఉత్తమ ఫలితాలు సాధించాలని సూచించారు.

అనంతరం పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎం. శ్రీనివాస్ సబ్ కలెక్టర్‌ను శాలువాతో ఘనంగా సన్మానించి జ్ఞాపికను అందజేశారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో సత్యనారాయణ, బీఎల్వోలు, ఉపాధ్యాయులు, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.

03 Jul 2026

Leave a Comment