ఆలూరు మండలం దేగం గ్రామ ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు సామాజిక సేవాభావంతో తిరుమల గౌడ్ మరియు ఆయన స్నేహితులు బీరువాను అందజేశారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలికి బీరువాను అధికారికంగా అందించారు.
ఈ సందర్భంగా తిరుమల గౌడ్ మాట్లాడుతూ, పాఠశాల అభివృద్ధికి తమ వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ అందిస్తామని తెలిపారు. విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత లక్ష్యాలను సాధించి మంచి భవిష్యత్తును నిర్మించుకోవాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో ఉజ్వల ట్రస్ట్ ప్రతినిధి మినీ శ్రీకాంత్, ఉప సర్పంచ్ ధర్మపురి, గ్రామస్తులు, పాఠశాల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.








