నిజామాబాద్‌లో నకిలీ అక్రిడిటేషన్ కార్డు కలకలం.. కలెక్టర్ సంతకం ఫోర్జరీ చేసి కార్డు తయారీ…

On: Thursday, July 2, 2026 9:31 AM

 

నిజామాబాద్: జిల్లాలో నకిలీ జర్నలిస్టు అక్రిడిటేషన్ కార్డు వ్యవహారం కలకలం రేపుతోంది. కొత్త అక్రిడిటేషన్ కార్డుల జారీ నేపథ్యంలో, జిల్లా కలెక్టర్ సంతకాన్ని ఫోర్జరీ చేసి నకిలీ కార్డును తయారు చేసిన ఘటన వెలుగులోకి వచ్చినట్లు సమాచారం.

తెలంగాణ ప్రభుత్వం ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా కొత్త జర్నలిస్టు అక్రిడిటేషన్ కార్డులను జారీ చేసింది. గతంలో అక్రిడిటేషన్ కలిగిన జర్నలిస్టులు కూడా తమ వివరాలను నవీకరించుకుని కొత్త కార్డులకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది. కఠిన నిబంధనలతో ప్రభుత్వం ఈ ప్రక్రియను చేపట్టింది.

అయితే, ఈ అవకాశాన్ని దుర్వినియోగం చేస్తూ ఓ వ్యక్తి ఒక చానల్ పేరుతో జిల్లా కలెక్టర్ సంతకాన్ని నకిలీగా రూపొందించి, మండల స్థాయి అక్రిడిటేషన్ కార్డును తయారు చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. శ్రీనివాస్ అనే వ్యక్తి పేరుతో ఈ నకిలీ కార్డు తయారై చెలామణి అవుతున్నట్లు సమాచారం.

ఈ వ్యవహారంపై సంబంధిత అధికారులు విచారణ చేపట్టి, నకిలీ కార్డు తయారీ వెనుక ఉన్న వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని జర్నలిస్టు వర్గాలు కోరుతున్నాయి.

27 Jul 2026

Leave a Comment