A9 న్యూస్:
ఆర్మూర్ పట్టణంలోని కెవిఆర్ కాలనీలో నివాసముంటున్న ప్రభుత్వ ఉపాధ్యాయురాలు కామిని గౌతమి (37) మంగళవారం చికిత్స పొందుతూ మృతి చెందారు. కుటుంబ సభ్యులు, పోలీసుల వివరాల ప్రకారం, ఆమె గత కొంతకాలంగా అనారోగ్యంతో పాటు మానసిక ఒత్తిడితో బాధపడుతున్నట్లు తెలిసింది. ఈ నెల 28వ తేదీన మధ్యాహ్నం సుమారు 2:30 గంటల సమయంలో ఆమె భర్త పల్దె రాజు బయటకు వెళ్లి తిరిగి ఇంటికి వచ్చేసరికి గౌతమి అపస్మారక స్థితిలో కనిపించారు. సమీపంలో యాసిడ్ బాటిల్ ఉండటంతో వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం నిజామాబాద్‌లోని మెడికవర్ ఆసుపత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం తుదిశ్వాస విడిచారు.
మృతురాలి భర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు సిఐ సత్యనారాయణ గౌడ్ తెలిపారు.








