హైదరాబాద్:
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శి (చీఫ్ సెక్రటరీ)గా సంజయ్ జాజు డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో సోమవారం అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు.
ఇప్పటి వరకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా విధులు నిర్వహించిన కె. రామకృష్ణారావు పదవీ విరమణ చేయడంతో, ఆయన స్థానంలో 1992 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి సంజయ్ జాజును నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జూన్ 26న ఉత్తర్వులు జారీ చేసింది.
ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు సంజయ్ జాజు నూతన ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టి, రాష్ట్ర పరిపాలనకు నాయకత్వం వహించనున్నారు. ఈ సందర్భంగా పలువురు ఉన్నతాధికారులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.








