దేగాంలో ఎస్ఐఆర్ ప్రోగ్రాం హెల్ప్ డెస్క్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన సబ్ కలెక్టర్ సేవలు, దరఖాస్తుల ప్రక్రియను పరిశీలించిన అభిజ్ఞాన్ మాల్వియా ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు.
ఆలూరు మండలం దేగాం గ్రామంలో నిర్వహిస్తున్న ఎస్ఐఆర్ (SIR) ప్రోగ్రాం హెల్ప్ డెస్క్‌ను సబ్ కలెక్టర్ అభిజ్ఞాన్ మాల్వియా ఆకస్మికంగా సందర్శించి పనితీరును పరిశీలించారు.
ఈ సందర్భంగా హెల్ప్ డెస్క్‌లో ప్రజలకు అందుతున్న సేవలు, దరఖాస్తుల స్వీకరణ, రికార్డుల నిర్వహణ, సిబ్బంది పనితీరును పరిశీలించి సంబంధిత అధికారులకు అవసరమైన సూచనలు చేశారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పారదర్శకంగా, వేగవంతంగా సేవలు అందించాలని ఆదేశించారు.
అనంతరం అక్కడికి వచ్చిన ప్రజలతో మాట్లాడి వారికి ఎదురవుతున్న సమస్యలను తెలుసుకుని, వాటి పరిష్కారానికి అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో దేగాం గ్రామ సర్పంచ్ ఇట్టిడి లింగారెడ్డి, సంబంధిత అధికారులు, సిబ్బంది, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.








