మెదక్ జిల్లా, చిన్న శంకరంపేట్ మండలం ,
కొరివిపల్లి గేటు వద్ద ఆదివారం సాయంత్రం సుమారు 5 గంటల సమయంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మెదక్-చేగుంట ప్రధాన రహదారిపై గజ్గట్లపల్లికి చెందిన ఆటో డ్రైవర్ తలారి శ్రీనివాస్ (రాములు కుమారుడు) ఆటోను యూ-టర్న్ తీసుకుంటున్న సమయంలో మెదక్ వైపు వెళ్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టినట్లు స్థానికులు తెలిపారు.
ఈ ప్రమాదంలో బైక్‌పై ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. ఒకరికి మోకాలి కింది భాగంలో కాలు విరగగా, మరొకరికి తొడ భాగంలో తీవ్ర గాయాలు అయ్యాయి.
ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న అంబులెన్స్ సిబ్బంది క్షతగాత్రులను మెదక్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
రిపోర్టర్: శ్రీకాంత్








