సునీత లక్ష్మి రెడ్డి బొమ్మరం ఐకేపీ కేంద్రంలో వరి ధాన్యం పరిశీలన.. రైతుల ఆవేదనపై వెంటనే స్పందించిన ఎమ్మెల్యే….

On: Monday, May 25, 2026 6:01 PM

ఈరోజు మాసాయిపేట మండలం పరిధిలోని బొమ్మరం గ్రామం లో, సునీత లక్ష్మి రెడ్డి ఐకేపీ సెంటర్‌లో వరి కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. అక్కడ రైతులు నిల్వ ఉంచిన వరి ధాన్యాన్ని చూసి ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

కొన్ని రోజులుగా ధాన్యం సంచుల్లోనే ఉండిపోవడంతో వడ్లు మొలకెత్తిన పరిస్థితిని గమనించిన ఎమ్మెల్యే వెంటనే స్పందించి, ఆ ధాన్యాన్ని తక్షణమే రైస్ మిల్లులకు తరలించాలని సబ్ కలెక్టర్ మరియు ఎంఆర్ఓ అధికారులతో చరవాణి ద్వారా మాట్లాడారు.

ధాన్యం సంచుల్లోనే మొలకెత్తిపోవడంతో రైతులు తీవ్ర నిరాశ వ్యక్తం చేస్తూ, తమ కష్టానికి తగిన ఫలితం దక్కాలని అధికారులను కోరారు. ఎమ్మెల్యే సునీత లక్ష్మి రెడ్డి రైతులకు ధైర్యం చెబుతూ సమస్య త్వరగా పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

25 May 2026

Leave a Comment