ఉపాధి హామీ పనుల వద్ద కార్మికులకు రాగి జావా అందించిన కుక్కదువ్వు రవి…. మాసాయిపేట మండలంలోని నాగసంపల్లి గ్రామంలో ఉపాధి హామీ పనుల వద్ద కార్మికులకు రాగి జావా పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. కీర్తిశేషులు ఎల్లం గారి ఆదర్శంతో ఆయన కుమారుడు కుక్కదువ్వు రవి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టబడింది.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఆంజనేయులు, వాదనాల నాగేష్, సిహెచ్ వెంకటేష్‌తో పాటు గ్రామ పెద్దలు పాల్గొన్నారు. ఉపాధి హామీ పనుల్లో పాల్గొంటున్న కార్మికులకు వేసవి కాలంలో శక్తినిచ్చే రాగి జావా పంపిణీ చేయడం అభినందనీయమని పలువురు పేర్కొన్నారు.








