చందాపూర్ గ్రామంలో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో కొత్తగా నిర్మించిన పెద్దమ్మ దేవాలయంలో ఈరోజు పెద్దమ్మ అమ్మవారిని ప్రతిష్ఠించి గజ స్థంభం నిలిపే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం పెద్దలు, గ్రామ పెద్దలు, సర్పంచ్, ఉప సర్పంచ్ మరియు గ్రామ ప్రజలు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తుల హారతులు, మంగళ వాయిద్యాల మధ్య అమ్మవారి ప్రతిష్ఠ కార్యక్రమం భక్తిశ్రద్ధలతో జరిగింది. గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.








