డాక్టర్ బి.అర్ అంబేద్కర్ గారి 135వ జయంతి….

On: Wednesday, April 15, 2026 6:36 AM

ఎ9 న్యూస్, తూప్రాన్, ఏప్రిల్ 14 :

ఈసందర్బంగా తూప్రాన్ మున్సిపల్ పరిధిలోని 9వ వార్డు రావెల్లి హైవే పైన కౌన్సిలర్ ఐలేష్ యాదవ్ గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన Dr బి. అర్.అంబెడ్కర్ గారి విగ్రహం గజ్వెల్ బి. అర్ ఎస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ఎఫ్ డి సి చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి గారు మరియు తూప్రాన్ మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీమతి బొంది రజిని రవీందర్ గౌడ్ గారి చేతులమీదుగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం లో మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ సమత కాశి రెడ్డి, కౌన్సిలర్లు చెలిమెల రాములు, సత్య లింగం, బొడ్డు రాధా కుమారి శ్రీనివాస్ మరియు స్థానిక అంబేద్కర్ సంగం నాయకులు, రావెల్లి గ్రామ పెద్దలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

15 Apr 2026

Leave a Comment