మాసాయిపేటలో డా. బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు ఘనంగా…

On: Tuesday, April 14, 2026 6:25 PM

మాసాయిపేట మండల కేంద్రంలో భారత రాజ్యాంగ శిల్పి B. R. Ambedkar 135వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు సమర్పించి ఘన నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా మాసాయిపేట సర్పంచ్ వీరన్న గారు మాట్లాడుతూ, రాజ్యాంగం ప్రకారం అంబేద్కర్ అందరివాడని, సమానత్వం ప్రతి ఒక్కరికీ వర్తించాలన్నారు. కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్కరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమానికి పి.ఎస్‌.ఎస్‌. డైరెక్టర్ ఉరుదండపురం నర్సింలు సభాధ్యక్షత వహించారు. కార్యక్రమంలో అంబేద్కర్ సంఘం సభ్యులు లక్ష్మణ్, డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి, మాజీ సర్పంచ్ మధుసూదన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

14 Apr 2026

Leave a Comment