మెదక్ జిల్లా మాసాయిపేటలో డా. బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు ….

On: Tuesday, April 14, 2026 6:22 PM

మెదక్ జిల్లా మాసాయిపేట మండల కేంద్రంలో భారత రాజ్యాంగ శిల్పి B. R. Ambedkar 135వ జయంతి వేడుకలను అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు సమర్పించి ఆయనకు ఘన నివాళులు అర్పించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మాజీ సర్పంచ్ మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ, రాజ్యాంగ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ సమానులేనని, సమానత్వం అన్నది అందరికీ వర్తించాల్సిన విలువ అని పేర్కొన్నారు. అంబేద్కర్ అందరివాడని, కొందరికి మాత్రమే పరిమితం కాదని ఆయన స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ పాలకవర్గ సభ్యులు, గ్రామ పెద్దలు, అంబేద్కర్ అభిమానులు, అంబేద్కర్ సంఘం సభ్యులు భారీ ఎత్తున పాల్గొన్నారు.

14 Apr 2026

Leave a Comment