ప్రతి ఒక్కరు రోడ్డు భద్రత పై అవగాహన కలిగి ఉండాలి. -అర్మూర్ ఏసీపీ వెంకటేశ్వర్ రెడ్డి….

On: Saturday, March 28, 2026 5:11 PM

రోడ్డు భద్రత వారోత్సవాల సందర్భంగా ఉజ్వల ట్రస్ట్ సహకారంతో అడవి దూది కాయల ఏరివేత….

ఆలూరు మండలం లోని మచ్చర్ల గ్రామం నుండి దేగాం మిర్ధపల్లి గ్రామాల మీదుగా ఆర్మూర్ వెళ్లే రహదారులు ఉన్నటువంటి అడవి దూది చెట్టుకు వచ్చిన కాయల ద్వారా వచ్చే దూది నీ తొలగించే కార్యక్రమాన్ని ఉజ్వల వ్యవస్థాపక అధ్యక్షులు మిన్ని శ్రీకాంత్ ఆర్మూర్ ఎసిపి వెంకటేశ్వర రెడ్డి ఆర్మూర్ సిఐ సత్యనారాయణ గౌడ్ ప్రారంభించారు ఈ సందర్భంగా ఆర్మూర్ ఏసిపి వెంకటేశ్వర రెడ్డి మాట్లాడుతూ ఈ యొక్క అడవి దూది కాయలు ఈ వేసవికాలంలో ఎండిపోయి ఆ యొక్క దూది రోడ్ అంతా చెల్లాచెదురై వాహనదారులను అనేక ఇబ్బందులకు గురిచేస్తాయని ఈ దూది అకస్మాత్తుగా వాహనదారుల కంటిలో పడగా ప్రమాదం జరిగే ఆస్కారం ఉందని మనిషి ముక్కు ద్వారా లోపటికి చేరి శ్వాసకోస వ్యాధులకు గురయ్యే ఆస్కారం ఉందని అందువల్ల ప్రభుత్వం చేపట్టిన అరైవ్ ఆలైవ్ అనే కార్యక్రమంలో మరియు రోడ్డు భద్రత వారోత్సవాల కార్యక్రమం ద్వారా ఇలా ప్రజా ప్రయోజన కార్యక్రమం మొదలుపెట్టడం ఎంతో ఆనందంగా ఉందని ఈ కార్యక్రమం ఉజ్వల ట్రస్ట్ సహకారంతో ఇలా ముందుకు రావడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు ఉజ్వల వ్యవస్థాపక అధ్యక్షుడు మిన్ని శ్రీకాంత్ మాట్లాడుతూ ప్రజా ప్రయోజనాల కోసం మా యొక్క ట్రస్టు ఎప్పుడు ముందుంటుందని సమస్య ఎక్కడ ఉంటుందో ఉజ్వల ట్రస్ట్ అక్కడ ఉంటుందని తెలుపుతూ రోడ్డు భద్రత వారోత్సవాల సందర్భంగా ఇలాంటి అడవి దూది చెట్ల ద్వారా ప్రజలకు వాహనదారులకు ఆపద వచ్చే ఆస్కారం ఉంటుందని గ్రహించి మా ట్రస్టు తరుపున ఆ యొక్క అడవి దూది గింజలను మరియు అడవిదూది కాయాలను తొలగించ కార్యక్రమాన్ని మొదలుపెట్టామని తెలిపారు ఈ కార్యక్రమంలో దేగాం శ్రీకాంత్ గౌడ్ సురేష్ రాము మరియు ట్రస్ట్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

28 Mar 2026

Leave a Comment