హైదరాబాద్:మార్చి 27:
దేశవ్యాప్తంగా ఉన్న వివిధ ప్రభుత్వ, ప్రైవేట్ హోటల్ మేనేజ్‌మెంట్ ఇన్‌స్టిట్యూ ట్‌లలో 026-27 విద్యాసంవత్సరానికి సంబంధించి బీఎస్సీ (హాస్పిటాలిటీ అండ్ హోటల్ అడ్మినిస్ట్రేషన్) కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహిచే నేషనల్ కౌన్సిల్ ఫర్ హోటల్ మేనేజ్‌మెంట్ జాయింట్ ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్ ఎన్ సి హెచ్ ఎం,జేఈఈ -2026 కు నోటిఫికేషన్‌ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేసింది.
జాతీయ స్థాయిలో నిర్వ హించే ఈ ప్రవేశ పరీక్షలో సాధించిన ర్యాంక్ ఆధారంగా నేషనల్ కౌన్సిల్ ఫర్ హోటల్ మేనేజ్‌మెంట్ అండ్ కేటరింగ్ టెక్నాలజీ అనుబంధ ఇన్‌స్టిట్యూట్ లలో బీఎస్సీ (హాస్పిటాలి టీ అండ్ హోటల్ అడ్మినిస్ట్రేషన్) కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ఈ కోర్సుల్లో ప్రస్తుతం దేశవ్యాప్తంగా 12 వేలకి పైగా సీట్లు ఉన్నాయి. అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో ఏప్రిల్ 1, 2026వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎన్.సి హెచ్ఎం,జేఈఈ 2026కు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఇంగ్లిష్ సబ్జెక్టుగా ఇంటర్మీడియట్ లో ఉత్తీర్ణత పొంది ఉండాలి. ఇంటర్ అర్హత కలిగిన వారు ఎవరైనా ఏప్రిల్ 1, 2026వ తేదీలోపు ఆన్‌లోన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు కింద జనరల్ అభ్యర్ధులు రూ.1000, ఈడబ్ల్యూఎస్ అభ్యర్ధులు రూ.700, ఎస్సీ/ఎస్టీ, దివ్యాంగ అభ్యర్ధులు, థర్డ్ జెండర్ అభ్యర్థులు రూ.450 చొప్పున చెల్లించవల్సి ఉంటుంది. ఇక రాత పరీక్ష ఏప్రిల్ 25, 2026న దేశ వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో ఆన్‌లైన్ విధానం లో నిర్వహించనున్నారు.








