Mar 27, 2026,
తెలంగాణ : ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థులకు సీఎం బ్రేక్ ఫాస్ట్ స్కీమ్‌ను అమలు చేయనున్నారు. ఇందుకోసం అధికారులు మెనూను రెడీ చేశారు. దీని ప్రకారం.. సోమవారం దోశ, మంగళవారం మిల్లెట్ ఇడ్లీ, బుధవారం పూరీ, గురువారం మిల్లెట్ ఇడ్లీ, శుక్రవారం మిల్లెట్ ఉప్మా/పొంగల్, శనివారం బోండా అందజేస్తారు. అలాగే సోమ, బుధ, శుక్రవారాల్లో పాలు, మంగళ, గురు, శనివారాల్లో రాగి జావ ఇస్తారు. కాగా ఈ పథకం కోసం ప్రభుత్వం రూ.720 కోట్లు కేటాయించింది.








