A9 న్యూస్ ప్రతినిధి, ఆర్మూర్:
ఆర్మూర్ మండలం చేపూర్ గ్రామంలో జరిగిన జనరల్ బాడీ సమావేశంలో గ్రామ అభివృద్ధి కమిటీ (విడిసి) నూతన అధ్యక్షుడిగా మీనుగు నాగరాజును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సమావేశానికి అధ్యక్షత వహించిన సారంగి శ్రీకాంత్ జమఖర్చులను సభ్యులకు వివరించిన అనంతరం కొత్త కమిటీని ఎంపిక చేశారు. ఉపాధ్యక్షుడిగా సూరినీడ దశరథ్, ప్రధాన కార్యదర్శిగా సురకంటి శ్రీనివాస్ రెడ్డి, కోశాధికారిగా శెట్టి శ్రీనివాస్, గౌరవ అధ్యక్షుడిగా సొక్కం సంజీవ్ ఎంపికయ్యారు. నూతన అధ్యక్షుడు నాగరాజు మాట్లాడుతూ, గ్రామ సర్పంచ్ సారంగి శాంతి కుమార్, సీనియర్ నాయకుల సహకారంతో గ్రామ అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు. గ్రామ ప్రజలు తమపై ఉంచిన నమ్మకానికి ధన్యవాదాలు తెలిపారు.








