Mar 24, 2026:
తెలంగాణ : హైదరాబాద్ రవాణాలో కొత్త దశ ప్రారంభం. పీఎం ఈ-డ్రైవ్ పథకం కింద హైదరాబాద్‌కు 915 ఎలక్ట్రిక్ బస్సులు మంజూరైనట్లు కేంద్రం తెలిపింది. CESL నేతృత్వంలో ఈకేఏ మొబిలిటీ-గ్రీన్ సెల్ కన్సార్టియం ద్వారా ఈ ప్రాజెక్ట్ అమలు కానుంది. నగర అవసరాలకు 100 మినీ బస్సులు, 815 12-మీటర్ల స్టాండర్డ్ ఫ్లోర్ బస్సులు అందుబాటులోకి వస్తాయి. పూర్తి ఎలక్ట్రిక్ వెహికల్స్ కావడంతో కాలుష్య ఉద్గారాలు ఉండవు. సురక్షిత, సౌకర్యవంతమైన, పర్యావరణహిత రవాణా సేవల కోసం నగర వాసులు ఈ కొత్త బస్సులను ఆస్వాదించనున్నారు.








