వరి సాగులో ఆధునిక పద్ధతులపై రైతులకు అవగాహన….

On: Wednesday, January 21, 2026 11:04 AM

 

నిజామాబాద్ జిల్లా, నందిపేట్ మండలం, చిమ్మరాజ్‌పల్లి:

చిమ్మరాజ్‌పల్లి రైతు వేదికలో డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ట్రైనర్ ప్రేమలత రైతులకు వరి సాగులో ఆధునిక పద్ధతులపై అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ తడి–పొడి విధానం ద్వారా యాజమాన్యం, నేరుగా వరి విత్తడం, భూసార పరీక్షల ఆధారంగా ఎరువుల వినియోగం వంటి నూతన సాగు పద్ధతులను రైతులకు వివరించారు. ఈ పద్ధతులను అనుసరించడం వలన పెట్టుబడి వ్యయం తగ్గడమే కాకుండా కూలీల ఖర్చు సుమారు రూ.8 వేల వరకు ఆదా అవుతుందని, అలాగే సాగు కాలం కూడా తగ్గిపోతుందని తెలిపారు.

అదేవిధంగా నీటి వినియోగాన్ని నియంత్రించుకోవడం ద్వారా పర్యావరణ పరిరక్షణకు తోడ్పడుతుందని, చీడపీడల నివారణ కూడా సులభతరం అవుతుందని అధికారులు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ఏవో రాంబాబు సార్, ఏఈఓ విజయ్ సార్, గ్రామ సర్పంచ్ లావణ్య మురళి, ఉపసర్పంచ్ తూర్పు నరేందర్, డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్ ఏరియా మేనేజర్ సుస్మిత, కమ్యూనిటీ ఫెసిలిటేటర్లు రాజేష్, మధు, జెసిఎఫ్ అన్వేష్ మరియు లీడ్ ఫార్మర్స్ పాల్గొన్నారు.

05 Feb 2026

Leave a Comment