మైనార్టీ గురుకులాల ప్రవేశాల కోసం దరఖాస్తులు….

On: Tuesday, January 20, 2026 12:56 PM

 

హైదరాబాద్:జనవరి 20

తెలంగాణ రాష్ట్రంలోని మైనార్టీ గురుకుల పాఠశాలలు మరియు కళాశాలల్లో ప్రవేశాల కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకో వాలని, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అజారుద్దీన్ తెలిపారు.ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరంలో చేరా లనుకునే వారు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని రాష్ట్ర మంత్రి అజహరుద్దీన్ ఒక ప్రకటనలో కోరారు.

ఇంటర్మీడియట్ తో పాటు… 6, 7, 8 తరగతుల్లో ఉన్న బ్యాక్‌ లాగ్ ఖాళీలను కూడా భర్తీ చేయనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. అర్హులైన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. మొత్తం 205 గురుకులాల్లో 107 బాలులకు 98 బాలికల కోసం ఉన్నాయని వీటిలో 70% శాతం సీట్లు మైనార్టీ విద్యార్థులకు రిజర్వ్ చేశామని వివరించారు.

ఈ అడ్మిషన్లకు సంబంధించి దరఖాస్తు చేసుకోవడానికి ఫిబ్రవరి 28తో ముగుస్తుం దని వెల్లడించారు.మొదట దరఖాస్తు చేసుకున్న మైనార్టీ విద్యార్థులకు ప్రాధాన్యం ఉంటుందని, మైనార్టీ యేతర విద్యార్థు లకు లక్కీ డీప్ ద్వారా సీట్లు కేటాయిస్తామని అన్నారు. ఈ గడువును మరోసారి పొడిగించే అవకాశం ఉండబోదని,మంత్రి స్పష్టంగా తెలియజేశారు.

కాబట్టి గడువు ముగిసేలోపే విద్యార్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది. మైనార్టీ విద్యార్థులకు నా ణ్యమైన విద్యను అందించే లక్ష్యంతో ప్రభుత్వం ఈ గురుకులాలను నడుపు తోందని, ఏవైనా సందేహాలు ఉంటే సంబంధిత పాఠశాల ల్లో సంప్రదించాలని సూచించారు.

05 Feb 2026

Leave a Comment