అత్యంత పేదలకు ఆర్థిక సాయం.. అర్హులు ఎవరంటే?…

On: Friday, January 16, 2026 12:28 PM

 

Jan 16, 2026,

తెలంగాణలో అత్యంత పేదరికంలో జీవిస్తున్న కుటుంబాలను ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు ఎస్సీ, ఎస్టీలకు ప్రాధాన్యమిస్తారు. సాగు భూమి లేని, స్థిర ఆదాయం రాని, రోజువారీ కూలిపై ఆధారపడి బతికేవారు. సాగుకు పనికిరాని బీడు భూమి మాత్రమే ఉన్నవారు. భర్త చనిపోయిన, విడిపోయిన, ఒంటరిగా జీవిస్తున్న మహిళలు. ఏ ఆసరా లేని వృద్ధులు, ట్రాన్స్‌జెండర్లు, పారిశుద్ధ్య పనులు చేసేవారు. క్యాన్సర్, టీబీ వంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు. 18 ఏళ్లు దాటినా పనిచేయలేని స్థితిలో ఉన్న దివ్యాంగులు, బతుకుదెరువు కోసం తాత్కాలికంగా ఇతర ప్రాంతాలకు వలస వెళ్లేవారు. ఈ పరిస్థితులున్న బీసీ, ఓసీ కుటుంబాలనూ పరిగణనలోకి తీసుకుంటారు.

25 May 2026

Leave a Comment