Jan 16, 2026,
తెలంగాణ : రాష్ట్రంలో కొత్తగా ఎన్నికైన సర్పంచులకు ఈ నెల 19 నుంచి వచ్చే నెల 21 వరకు శిక్షణ తరగతులు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రతి జిల్లాలోని సర్పంచులను ఐదు బృందాలుగా విభజించి 5 రోజుల పాటు ఆయా జిల్లాల్లో తరగతులు నిర్వహిస్తారు. వారికి బస, భోజనం, శిక్షణా ఖర్చుల కోసం ఒక్కొక్కరికి రూ.5,000 వరకు వెచ్చిస్తారు. ఈ మేరకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది.








