*విద్యార్థుల చేత మొక్కలు నాటింపు.
A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్:
ఆర్మూర్ పట్టణంలోని టీచర్స్ కాలనీ క్షత్రియ పాఠశాలలో రుతుపవనాల ప్రారంభాన్ని పురస్కరించుకొని వనమహోత్సవం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యార్థులు పాల్గొని అనేక రకాల మొక్కలు నాటారు. మొక్కల ఉపయోగాలు, పర్యావరణ పరిరక్షణపై ఉపాధ్యాయులు విద్యార్థులకు అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమం పాఠశాల చైర్మన్ అల్జాపూర్ శ్రీనివాస్ సూచన మేరకు నిర్వహించబడింది. పాఠశాల ప్రిన్సిపల్ డి.నవిత, ఉపాధ్యాయ బృందం విద్యార్థులకు మార్గనిర్దేశనం చేశారు.