*ఐఐఐటి లో అడుగుపెట్టిన ముగ్గురు విద్యార్థులు.
A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్:
తెలంగాణ టీజీఎంఆర్‌ఎస్/ గురుకుల ఇంటర్మీడియట్ కళాశాల (TGMRS/JC) ఆర్మూర్ బాలుర శాఖకి చెందిన ముగ్గురు విద్యార్థులు ప్రతిష్టాత్మకమైన భారత ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IIIT) లో ప్రవేశం పొందిన సంతోషకర సమాచారం వెలుగులోకి వచ్చింది.
IIIT ప్రవేశ పరీక్షలో మెరిసిన విద్యార్థులు కె. సాయితరూన్,
ఎం. శ్రీనిత్, కె. ఇస్సాక్.
వీరు ఆలూర్ కేంద్రంలో నిర్వహించబడిన ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి, తాము పొందిన విద్యా అవకాశాన్ని కుటుంబానికి, గురుకుల సిబ్బంది. మార్గదర్శకత్వానికి అంకితమిస్తున్నట్లు తెలిపారు.
కళాశాల ప్రిన్సిపాల్ సిహెచ్ యోగేష్,
కళాశాల సిబ్బంది. ఈ ముగ్గురు విద్యార్థులకు అభినందనలు తెలియజేస్తూ ఇది మిగతా విద్యార్థులకు ప్రేరణగా నిలుస్తుందన్నారు.