మూడు పతకాలతో మెరిసిన సిద్ధార్థ విద్యార్థి షేక్ అనాస్:

On: Thursday, July 3, 2025 5:42 PM

 

A9 న్యూస్ :

ఆర్మూర్,

జులై 04.2025,

నిజామాబాద్ జిల్లా నాగారంలో (జూలై 2)న జరిగిన జిల్లా స్థాయి అథ్లెటిక్స్ మీట్‌లో నందిపేట్ సిద్ధార్థ హైస్కూల్‌కు చెందిన ఎనిమిదో తరగతి విద్యార్థి షేక్ అనాస్ ఘన విజయాలు సాధించాడు. నందిపేట్ మండలం వన్నెల్ (కే) గ్రామానికి చెందిన అనాస్ అండర్-14 విభాగంలో మూడు పతకాలతో ప్రతిభాప్రదర్శన చేసినట్టు జిల్లా యూత్ స్పోర్ట్స్ ఆఫీసర్ బక్కూరి పవన్ కుమార్ వెల్లడించారు.

బ్యాక్ త్రో లో బంగారు పతకం లాంగ్ జంప్ లో వెండి పతకం 60 మీటర్ల పరుగులో మరో వెండి పతకం సాధించి జిల్లా స్థాయిలో తన దక్షతను నిరూపించుకున్న అనాస్ రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్‌కు ఎంపికై పాఠశాల గౌరవాన్ని మరింత పెంచాడు.

ఈ సందర్భంగా స్పందించిన అనాస్ మాట్లాడుతూ ఐపీఎస్ అధికారి కావడం నా లక్ష్యం ప్రజలకు సేవ చేయాలన్నదే నా ఆశయం అని తెలిపాడు.

విజయానంతరం పాఠశాల కరెస్పాండెంట్ దేవన్న, డైరెక్టర్ వంశీ ,వ్యాయామ ఉపాధ్యాయుడు రంజిత్, ఉపాధ్యాయ బృందం అనాస్‌ను అభినందిస్తూ భవిష్యత్ లో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.

23 Jul 2025

Leave a Comment