ఘనంగా ఆషాడం గోరింటాకు కార్యక్రమం నిర్వహణ

On: Friday, July 4, 2025 5:47 PM

ఆర్మూర్ పట్టణ కేంద్రంలోని టీచర్స్ కాలనీలో గల సరస్వతి విద్యా మందిర్ పాఠశాలలో ఘనంగా ఆషాడం గోరింటాకు కార్యక్రమం నిర్వహణ.

A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్:

శ్రీ సరస్వతి విద్యా మందిర్ పాఠశా లలో ఆషాడ మాసంలో గోరింటాకు విశిష్టత తెలుపుతూ ఆడపిల్లలందరికీ గోరింటాకు చేతికి పెట్టి ఆనందదాయకంగా కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాతాజీ లందరూ గోరింటాకు విశిష్టతను పిల్లలకు తెలుపుతూ వర్షాకాలంలో ఎక్కువగా అంటువ్యాధులు, ఇతరత్రా జబ్బు లు వచ్చే అవకాశం ఉంటుందని గోరింటాకు చేతులు, కాళ్లకు పెట్టుకోవడం వలన వ్యాధులు సైతం ధరిచేరవని ప్రతి ఒక్కరు విశ్వసిస్తారని తెలియజేసారు. ఈ కార్యక్రమంలో పాఠశాల మేనేజ్మెంట్ భానుతేజ్ అభిమన్యు,ప్రిన్సిపల్ వినోద్ కుమార్ మాతాజీ విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

23 Jul 2025

Leave a Comment