A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్:
ఆర్మూర్ డివిజన్ పరిధిలో జూలై 1వ తేదీ నుండి 31వ తేదీ వరకు ఆపరేషన్ ముస్కాన్-XI కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం ద్వారా బాల కార్మికులు అనాథలు, వీధి పిల్లలు, అదృశ్యమైన చిన్నారులు, రహదారి పిల్లలు, ఇతర శ్రమలో ఉన్న బాలలు, వంటి వారి గుర్తింపు రక్షణ పునరావాసం లక్ష్యంగా ఉంచుకొని అధికారులు సమిష్టిగా చర్యలు చేపడతారు.
ఈ కార్యక్రమంలో ఆర్మూర్ ఎస్సై రమేష్, లేబర్ ఆఫీసర్ ప్రభు దాస్, చైల్డ్ హెల్ప్‌లైన్-1098 సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.