A9 న్యూస్, ప్రతినిధి, ఆర్మూర్:
ఆర్మూర్ పట్టణంలోని పెర్కిట్ గ్రామంలో ఆన్లైన్ మట్కా ఆడుతున్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు పట్టుకున్నారు. మహమ్మద్ ఎజాజ్, షేక్ ఆబిద్, మహమ్మద్ జాకీర్ హుస్సేన్ అనే ముగ్గురు యువకులు మహారాష్ట్రకు చెందిన గోల్ అనే వ్యక్తితో కలిసి ఫోన్‌పే ద్వారా డబ్బులు పంపిస్తూ మట్కా ఆటలో పాల్గొంటున్నట్లు పోలీసులు గుర్తించి మెరుపు దాడి చేశారు. వారి వద్ద నుండి రూ.6,000/- నగదు మరియు మూడు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ వ్యవహారం పై పోలీసులు విచారణ చేపట్టారు.