MRPS 31 ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలి….

On: Monday, June 30, 2025 6:18 AM

A9 న్యూస్ ప్రతినిధి మెదక్:

మెదక్ జిల్లా కేంద్రంలో రాందాస్ చౌరస్తాలో ఎమ్మార్పీఎస్ గద్దెనిర్మాణ కొరకు భూమి పూజ ప్రారంభించిన బొజ్జ సైదులు మెదక్ జిల్లా ఇన్చార్జి

పద్మ శ్రీ మంద కృష్ణ మాదిగ ఆదేశాల మేరకు MRPS 31 ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలి. అన్నారు అనంతరం ఉప కులాలైన బుడగ జంగాల నాయకులతో సమావేశంలో మాట్లాడుతూ ఉపకులాల ప్రజల భాగస్వామ్యంతో ఎస్సీ రిజర్వేషన్ల ఫలాలు దయనీయస్థితి నిరుద్యోగులకు మెరుగుపరిచేందుకు సాధించామన్నారు.

మెదక్ జిల్లా ఎమ్మార్పీఎస్ కార్యనిర్వాక అధ్యక్షులు అస్తర్ గల్ల బాలరాజ్ మాదిగ అధ్యక్షతన జరిగింది.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మెదక్ జిల్లా ఇన్చార్జిలు బొజ్జ సైదులు మాట్లాడుతూ సామాజిక ఆర్థిక రాజకీయ అసమానతల లేని నూతన సమాజ నిర్మాణం కాంక్షిస్తూ ఎమ్మార్పీఎస్ ఉద్యమం తన ప్రయాణాన్ని కొనసాగిస్తుందని అన్నారు. మాదిగ సమాజానికి దక్కవలిసిన రిజర్వేషన్ హక్కుల కోసం పోరాడుతూనే మరోవైపు నిరాదరణకు గురైన వర్గాలైన వికలాంగుల వృద్దులు వితంతువుల కోసం పోరాడి వారికి పెన్షన్లు సాధించడం జరిగింది. గుండె జబ్బుల చిన్నారులకు ఉచిత ఆపరేషన్లు, ఆరోగ్యశ్రీ పథకం, ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల ప్రమోషన్లలో రిజర్వేషన్లు, తెలంగాణ అమరుల కుటుంబాలకు ఉద్యోగాలు, మహిళ భద్రత కోసం ఫాస్ట్ ట్రాక్ కోర్టులు, తెల్ల రేషన్ కార్డు ప్రజలకు 6 కిలోల బియ్యం పెంపు మొదలగు ఫలితాలను ఎమ్మార్పీఎస్ సాధించిందని మెదక్ జిల్లా ఎమ్మార్పీఎస్ అధ్యక్షులు చెట్లపల్లి యాదగిరి ఎమ్మార్పీఎస్ సీనియర్ ఎంఎస్పీ జిల్లా అధ్యక్షులు ఉషన్న గళ్ళ మురళి మహిళా విభాగం జిల్లా అధ్యక్షులు మాధవి మెదక్ మండల నాయకులు గట్టయ్య పవన్ లక్ష్మణ్ రత్నయ్య రవి అన్నారు. మాదిగదండోరా సామాజిక ఉద్యమం సాధించిన ఈ ఫలాలు కేవలం మాదిగల కోసం చేసినవి కావని, అన్ని అట్టడుగు అణగరి వెనుకబడిన వర్గాల సంక్షేమం సామాజిక బాధ్యతతో చేసిన ఉద్యమలని అని అన్నారు. కాబట్టి సమాజ హితమే ధ్యేయంగా ఎమ్మార్పీఎస్ పోరాడుతుందని అన్ని వర్గాల ప్రజలు గుర్తించాలని అన్నారు. మాదిగల ఉప కులాల రాజ్యాంగ రిజర్వేషన్ల కోసం ముప్పై ఏళ్లుగా జరిగిన రాజీలేని పోరాటం విజయవంతమై సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణాలో ఎస్సీ వర్గీకరణ అమలు జరుగుతుందని అన్నారు. ఈ విజయానికి కారణం ఎమ్మార్పీఎస్ ఉద్యమానికి అన్ని వర్గాల ప్రజలు అందించిన సహకారమే అని అన్నారు. దేశంలో ఎన్నో కుల ఉద్యమాలు పుట్టినప్పటికీ లక్ష్యం సాధించే వరకు ఏ ఉద్యమం నిలబడలేకపోయాయి కాని సమావేశం సందర్భంగా గుర్తు చేశారు. ఎమ్మార్పీఎస్ మాత్రమే సజీవంగా నిలబడి లక్ష్యం చేరిందని దానికి సమాజం ఇచ్చిన సహకారమే ప్రధాన కారణమని అన్నారు. కనుక సమాజానికి కృతజ్ఞతగా భవిష్యత్ ఉద్యమ కార్యాచణతో ముందుకు సాగుతామని అన్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మార్పీఎస్ 31 ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా ప్రతి మండల కేంద్రంలో గ్రామ గ్రామాన నిర్వహించాలని నాయకులకు కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో బుడగ సంఘాల మెదక్ జిల్లా అధ్యక్షులు టేక్ శంకర్, టేక్ సుందర్, బాజా మల్లేశం, శంకర్, శ్రీశైలం, ఆనంద్ నర్సింలు మహిళా నాయకులు సుగుణ, నర్సవ్వ, స్వాతి, ప్రమీల, మాధవి తదితరులు పాల్గొన్నారు.

23 Jul 2025

Leave a Comment