కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు 72వ జన్మదిన వేడుకలు మాసాయిపేటలో ఘనంగా నిర్వహణ….

On: Tuesday, February 17, 2026 9:06 PM

 

మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గంలోని మాసాయిపేట మండల కేంద్రం మాసాయిపేట పట్టణం చావడి వద్ద తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) 72వ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమాన్ని భారత్ రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) మాసాయిపేట మండల అధ్యక్షుడు చిన్న చౌదరి మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. భారీ ఎత్తున పార్టీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొని “కేసీఆర్ నాయకత్వం వర్ధిల్లాలి” అనే నినాదాలతో టపాసులు పేల్చి, కేకులు కట్ చేసి, స్వీట్లు పంచుకున్నారు.

అనంతరం ర్యాలీగా ప్రభుత్వ పాఠశాలకు వెళ్లి కేసీఆర్ జన్మదినం సందర్భంగా విద్యార్థులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా చిన్న చౌదరి మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ రానున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో కూడా వచ్చే ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వమే అవుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.

17 Feb 2026

Leave a Comment