నిజామాబాద్ జిల్లా జక్రాన్పల్లి మండలంలో ఫోటోగ్రాఫర్స్ మరియు వీడియోగ్రాఫర్స్ సంఘం నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా సభ్యులు మాట్లాడుతూ, మండలంలోని ప్రతీ ఫోటోగ్రాఫర్ మరియు వీడియోగ్రాఫర్ ఐక్యంగా కొత్త కమిటీని ఏర్పాటు చేసినట్టు తెలిపారు.వారు చెప్పారు, “సంఘాన్ని మరింత బలోపేతం చేసి, సభ్యుల హక్కులు, సంక్షేమం కోసం పని చేయగల నాయకులను ఈ కొత్త కార్యవర్గంగా ఎన్నుకున్నాం.”
ఈ కార్యవర్గంలో:
అధ్యక్షుడిగా- ఎం. మహేందర్.
ఉపాధ్యక్షులుగా కుమార్ – సురేష్
ప్రధాన కార్యదర్శిగా- నరేష్.
కార్యదర్శిగా- రవి.
సహాయకులుగా- మగ్గిడి శంకర్
కోశాధికారిగా -మహిపాల్.
తదితరులు ఎంపికయ్యారు.
కార్యవర్గ సభ్యులందరూ సంఘాన్ని ముందుండి నడిపించడానికి తాము కృషి చేస్తామని తెలిపారు.







