గుండెపోటుతో మృతి చెందిన డ్రైవర్ కుటుంబానికి ఆర్థిక సహాయం…

On: Monday, June 30, 2025 6:38 AM

A9 న్యూస్ ప్రతినిధి నిజామాబాద్:

పడగల్ గ్రామానికి చెందిన సాజీద్ ఆర్మూర్ ఆర్టీసీ డిపోలో అద్దె బస్సు డ్రైవర్‌గా గత కొంత కాలంగా విధులు నిర్వర్తిస్తున్నారు జూన్ 24వ తేదీన ఆయన గుండెపోటుతో హఠాన్మరణం చెందారు సాజీద్ కు భార్య ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

ఈ విషాద సందర్భంలో హెయిర్ బస్సు డ్రైవర్స్ యూనియన్ ఆధ్వర్యంలో సాజీద్ కుటుంబానికి ఆర్థిక సహాయం అందించేందుకు కృషి జరిగింది. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ కండక్టర్లు మెకానిక్ సిబ్బంది ఎస్టీఐ మేడం గారు, అద్దె బస్సు డ్రైవర్లు పాల్గొని మొత్తం రూ. 20,000 నగదు మరియు రెండు నెలల పాటు సరిపడే రూ. 5,000 విలువైన ఇంటి పోషణ సరుకులు అందజేశారు.

ఈ సహాయ కార్యక్రమంలో యూనియన్ అధ్యక్షులు బి. శ్రీనివాస్, అమృత్, నాని, కండక్టర్ రమణయ్య పాల్గొన్నారు.

23 Jul 2025

Leave a Comment