A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్:
ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని వడ్డెర కాలనీ మండల పరిషత్ ప్రైమరీ స్కూల్‌లో రోటరీ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ ఆధ్వర్యంలో విద్యార్థులకు నోట్ పుస్తకాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్పాన్సర్‌గా రాజేందర్ రెడ్డి వ్యవహరించారు.
ఈ సందర్భంగా రోటరీ క్లబ్ ఐపీ ప్రెసిడెంట్ రజనీష్ కిరాడ్ మాట్లాడుతూ వడ్డెర కాలనీ స్కూల్ విద్యార్థులు క్రమశిక్షణగా ఉండటమే కాక, ఇక్కడ ఉపాధ్యాయులు నాణ్యమైన విద్య అందిస్తున్నారని ప్రశంసించారు. అదే కారణంగా ఈ పాఠశాలను ఎంపిక చేశామన్నారు. రోటరీ క్లబ్ తరఫున విద్యార్థుల సహాయానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నామని తెలిపారు.
పాఠశాల ప్రధానోపాధ్యాయులు లక్ష్మణ్ మాట్లాడుతూ విద్యార్థులకు టైలు, బెల్ట్‌లు అవసరమని తెలియజేశారు. దీనికి స్పందించిన క్లబ్ సెక్రెటరీ ఖాందేశ్ సత్యం రాబోయే కార్యక్రమంలో అవి కూడా రోటరీ ద్వారా అందజేస్తామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో రాస ఆనంద్, పుష్పకర్ రావు, వి.లక్ష్మీనారాయణ, నరేష్ ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.