జూలై 9న సమ్మెను జయప్రదం చేయండి:

On: Saturday, July 5, 2025 10:11 PM

సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు పిలుపు.

A9 న్యూస్ ప్రతినిధి నిజమాబాద్:

జూలై 9న దేశవ్యాప్తంగా నిర్వహించనున్న కార్మిక సమ్మెను విజయవంతం చేయాలని సిపిఎం నిజామాబాద్ జిల్లా కార్యదర్శి ఏ. రమేష్ బాబు మున్సిపల్ కార్మికులకు పిలుపునిచ్చారు. మున్సిపల్ ఎంప్లాయిస్, కార్మికులు, యూనియన్ సిఐటియు (CITU) అధ్యక్షుడిగా ఆయన వివిధ ప్రాంతాల్లో ప్రచారం నిర్వహించి కరపత్రాలు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వాతంత్ర్యానంతరం కార్మిక వర్గం పోరాటాలతో సాధించిన 29 కార్మిక చట్టాలను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసి నాలుగు కార్మిక కోడ్‌లు తీసుకురావడం కార్మిక వర్గానికి తీవ్రంగా అనుకూలించదని పేర్కొన్నారు. కొత్త చట్టాల ద్వారా కనీస వేతనాలు, ఎనిమిది గంటల పని వ్యవస్థలు నిలిపివేసి ఉద్యోగ భద్రతకూ హానికరంగా మారిందని విమర్శించారు.

కేంద్ర ప్రభుత్వం పెరిగిన ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలని, సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని, నిత్యావసర వస్తువుల ధరలను నియంత్రించాలని ఆయన డిమాండ్ చేశారు.

ఈ సమ్మెలో మున్సిపల్ కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని తమ హక్కుల కోసం ధైర్యంగా ముందుకు రావాలని రమేష్ బాబు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ యూనియన్ అధ్యక్షుడు భూపతి, రేకుల నరసయ్య, సంతోష్, ఏక్ నాథ్, సదాశివ తదితరులు పాల్గొన్నారు.

23 Jul 2025

Leave a Comment