బాలికలకు సైకిల్స్ పంపిణీ చేసిన రోటరీ క్లబ్…

On: Monday, June 30, 2025 9:24 PM

A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్:

ఆర్మూర్ పట్టణంలోని రోటరీ క్లబ్ నిర్వహించిన “సైకిల్‌తో బాలికలను శక్తివంతులను చేద్దాం” ఈ కార్యక్రమం జెడ్.పి.హెచ్.ఎస్ బాలురు హైస్కూల్ జిరాయత్ నగర్‌లో సోమవారం 8 మంది విద్యార్థినులకు సైకిళ్లు పంపిణీ చేశారు. ఈ సైకిళ్ల విలువ రూ. 40,000/-.

ప్రధానోపాధ్యాయులు లక్ష్మీనరసయ్య ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంలో రోటరీ అధ్యక్షుడు రజనీష్ కిరాడ్ మాట్లాడుతూ, చదువు కోసం విద్యార్థినులు స్కూల్ దూరం వల్ల చదువును మానేయకూడదన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

రోటరీ సభ్యులు తులసి కుమార్, కార్యదర్శి రాస ఆనంద్, వి. లక్ష్మీనారాయణ, ఖాన్దేష్, సత్యం, వన్నెల్ దేవి రాము, ఉపాధ్యాయులు, విద్యార్థిని, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

23 Jul 2025

Leave a Comment