A9 న్యూస్ హైదరాబాద్ ప్రతినిధి:
ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా హైదరాబాద్‌లోని హెచ్‌ఎండీఏ మైదానం తెలంగాణ విశిష్టతను తెలిపే పాటలతో మార్మోగింది. ప్రముఖ సంగీత దర్శకుడు వందేమాతరం శ్రీనివాస్ సారథ్యంలో ప్రత్యేకంగా సంగీతవిభావరి నిర్వహించారు. శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మంత్రి పొన్నం ప్రభాకర్, మేయర్ విజయలక్ష్మి, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, సీఎస్ శాంతి కుమారి తదితరులు హాజరై సాంస్కృతిక కార్యక్రమాలను లాంఛనంగా ప్రారంభించారు. భారీగా తరలివచ్చిన ప్రజలను వందేమాతరం శ్రీనివాస్ బృందం తమ పాటలతో ఉర్రూతలూగించింది. కల్పన, సాయిచరణ్ ఆలపించిన ‘పూసిన పున్నమి వెన్నెల’ అంటూ సాగే తెలంగాణ గీతం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.